వ్యక్తిగత కక్షతోనే రాహుల్ గాంధీని వెంటాడుతున్నారు: సీపీఐ నారాయణ

CPI Narayana | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగ మేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర క వ్యక్తిగత కక్షతోనే ఆయనను వెంటాడుతున్నారు. సీపీఐ నారాయణక్ష దాగుందని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్ సభ స్పీకర్… ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆ వెంటనే ఎంపీగా దక్కిన నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం చేయడం… ఇదంతా కూడా వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో మోడీ, అధానీల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దుచేసి అధికారిక నివాసం నివాసం నుండి ఖాళీ చేయించారని అన్నారు.

రాహుల్ గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందన్నారు. ఈ విషయాన్ని మనం ఎన్నటికీ మరువకూడదన్నారు. ఆయన తాత ముత్తాతలు బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బిజెపికి ప్రజలు భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్