Harassment | ప్రేమించలేదని యువతికి ఓ యువకుడు టార్చర్ చూపించాడు. చిత్రహింసలు పెట్టి నానా నరకయాతనకు గురి చేశాడు. ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఈ ఘటన జరిగింది. తనకు ప్రేమించడం లేదన్న కారణం చేత అనుదీప్ అనే వ్యక్తి.. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిని చిత్రహింసలకు గురిచేశాడు. గదిలో బంధించి ఒంటిపై వేడి నూనెను పోశాడు. దీంతో నొప్పిని భరించలేని యువతి నానా తంటాలు పడుతూ.. చివరికి ఆ దుర్మార్గుడు అనుదీప్ నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వేడి నూనె ఒంటిపై పోయడంతో యువతికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంభందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రేమించలేదని యువతికి టార్చర్… ఒంటిపై వేడినూనె పోసి…
0
439
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


