తెలంగాణలో వరద పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని మోదీ. సీఎం రేవంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గత రెండ్రోజులుగా రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరద పరిస్థితిని నష్టాన్ని ప్రధానికి వివరించారు రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల గురించి తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తంగా వ్యవహరించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ అభినందించారు. వీలైనంత త్వరగా హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలు అన్ని అందిస్తామన్నారు.