స్వతంత్ర వెబ్ డెస్క్: నేడు రాష్ట్రపతి ద్రూపడి ముర్ము హైదరాబాద్ రానున్నారు. నేటి సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి అటు నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రేపు(శనివారం) ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరవుతారు. పరేడ్ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేటి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. సీటీఓ జంక్షన్, పీఎన్‌బీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్‌పీఎస్ స్కూల్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎంటీఎస్, వీవీ విగ్రహం జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. అందువల్ల ఆయా రూట్లలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.