వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారణాసిలోని కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన మోదీ.. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆయన వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసికి వచ్చారు. అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ, ఎన్‌డీఏ కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

నామినేషన్‌ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో మోదీ ప్రార్థనలు చేశారు. దీని తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ , ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే నితీష్ కుమార్ అస్వస్థతకు గురయ్యారని, ఈ కారణంగా అతను ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్