34.2 C
Hyderabad
Monday, May 27, 2024
spot_img

కమలదళం వ్యూహం ఫలించేనా? రాహుల్ గాంధీ గట్టెక్కేనా ?

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయిం చుకో వడంతో బీజేపీ ఉలిక్కి పడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత.. ఈ సారి అమేథీతోపాటు రాయ్ బరేలీలోనూ బీజేపీ జెండా ఎగురవేయగలమన్న ధీమాతో ఉంది. ఆ నేపథ్యంలో కేరళ వయినాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ. బహుశా మళ్లీ.. అమేథీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. ఈ నేపథ్యంలో రాయ్ బరేలీ బరిలో రాహుల్ గాంధీ అరంగేట్రం చేయడంతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

రాయ్ బరేలీ కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోట. రాయ్ బరేలీ లోక్ సభ స్థానం “వీఐపీ సీట్” అన్నభావన స్థానిక ప్రజల్లో ఉంది. 2014 లో మోదీ ప్రభంజనం లోనూ.. రాయ్ బరేలీ, అమేథీలలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో కేంద్రంలో కాషాయదళం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ, అమిత్ షా ద్వయం ” రాయ్ బరేలీ, అమేథీలో పాగా వేయడం ఎలా.. ” అన్న వ్యూహంతోనే అడుగులు వేస్తూ వచ్చారు. బీజేపీ అటల్ భవన్ ఆఫీస్ లో గాంధీ కుటుంబం కంచుకోట బద్దలు కొట్టే వ్యూహరచన సాగుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని మోదీ – యోగి డబుల్ ఇంజన్ సర్కార్ వ్యూహాన్ని అమలుచేసే కార్యక్రమం చేపట్టింది.

కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ను దెబ్బతీయాలంటే.. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడమే..అన్న నిర్ణయంతో సామాన్యులకు ఇళ్లు ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్ లు అందించడం మొదలైంది. రాయ్ బరేలీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఉచితంగా టాయి లెట్ లు నిర్మింపజేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు. జనం జబ్బువచ్చినా, జ్వరం వచ్చినా సరైన వైద్యం అందక బాధపడేవారు. ఇక ఆపరేషన్ వంటివి అవసరమైతే ఇళ్లు, భూములు అమ్ముకోవడమో.. తాళి బొట్టు అమ్ముకోవడమో తప్ప మరో గత్యంతరంలేదు. మోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్.. తో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కూడా ఫ్రీ చికిత్స.. యోగి సర్కార్ హయాంలో 20- 30 శాతం మంది ఓటర్లకు వివిధ పథకాల కింద ప్రయోజనాలు అందుతూ వచ్చాయి. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందని.. ప్రజలకు మోదీ -యోగీ సర్కార్ ఉచితాలను రుచి చూపించింది.

మోదీ ప్రభజనం లో 2014లో కాంగ్రెస్ రాయ్ బరేలీ, అమేథీ సీట్లతో నెగ్గిన తర్వాత .. మోదీ. అమిత్ షా .. ఆ రెండు స్థానాల్లో బీజేపీని బలోపేతం చేయడం పై దృష్టిపెట్టారు. 2019 నుంచి రాయ్ బరేలీ, అమేధీలకు చెందిన పలువురు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు వివిధకారణాలతో బీజేపీలో చేరారు. నయానో భయానో కాషాయ కండువా కప్పుకున్నారు.రాయ్ బరేలీ నియోజకవర్గంలోని ఊంచహార్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే, యూపీ అసెంబ్లీలో ఎస్పీ చీఫ్ విప్, అమేథీ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్, బీజేపీ వైపు మొగ్గారు. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, భార్య ప్రజాపతి పై ఈడీ ని ప్రయోగించారు.మనీలాండరింగ్, అక్రమ మైనింగ్, ఆదాయాన్ని మించిన ఆస్తుల వంటి కేసులు ఎన్నో ప్రజాపతి కి ఢిల్లీ, అమేథీలో ఇళ్లనూ ఈడీ జప్తు చేసింది. వలసల విషయానికి వస్తే.. 2021లో రాయ్ బరేలీ సదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ బీజేపీలో చేరారు. ఈ ఫిబ్రవరిలో మనోజ్ పాండే కాషాయ కండువా కప్పుకున్నారు. రాహుల్ నామినేషన్ వేస్తాడని తెలిసిన రోజే మనోజ్ పాండే కొడుకు బీజేపీలో చేరాడు. ఈ మధ్యే ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్ సోదరుడితో పాటు 1 మంది స్థానిక నాయకులు కమలదళంలో చేరారు. జిల్లాపరిషత్ అధ్యక్షులనుంచి బ్లాక్ నాయకులనూ బీజేపీలో చేర్చేశారు.

రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం. అదీగాక, కాస్త బలహీనుడైన ప్రత్యర్థి ఉండడమే. అన్న టాక్ ఉంది. రాయ్ బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్ సింగ్ ను బీజేపీ ప్రకటించింది. సింగ్ యూపీ యోగి సర్కార్ లో సహాయమంత్రిగా ఉన్నారు. 2019 లో రాయ్ బరేలీ లో సోనియాగాంధీ చేతిలో ఓడి పోయారు. దినేశ్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. 2018లో బీజేపీలో చేరారు. నియోజకవర్గంలో క్రమంగా పరిస్థితి మారుతూ వచ్చింది. బీజేపీ రాయ్ బరేలీలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోతూ వచ్చినా.. ఓట్ బ్యాంక్ పెంచు కుంటూ వచ్చింది. 2014లో బీజేపీ కి లక్షా 73 వేల ఓట్లు వస్తే, 2019లో ఆ ఓట్లు 3 లక్షల67 వేల ఓట్లను సాధించింది. ఒకప్పుడు కాంగ్రెస్ కు రాయ్ బరేలీలో ఎదురులేదు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాయ్ బరేలీ, అమేథీలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిస్తే,  బీజేపీ స్కోర్.. జీరో.. 2012 లో ఎస్పీ 7 చోట్ల, కాంగ్రెస్ రెండు చోట్ల గెలిచినా బీజేపీ స్కోర్ జీరోనే.. 2017 లో గాంధీ కుటుంబం కంచుకోటలో కమల వికాశం ఆరంభమైంది. పదిసీట్లలో బీజేపీఆరు, ఎస్పీ రెండు, కాంగ్రెస్ రెండు చోట్లగెలిచాయి. 2022 లో ఎస్పీ ఆరు, బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ జీరో.. ఆ విధంగా బీజేపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ను దెబ్బతీసింది.

కాంగ్రెస్ దిగజారుడుకు ప్రధాన కారణం. గాంధీ కుటుంబానికి సాంప్రదాయంగా వస్తున్న ఈ స్థానాల్లో ప్రజలు మనల్నే గెలిపిస్తారనే ధీమానే. విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు, అమలు చేయక పోవడమే. 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ రాయ్ బరేలీ, అమేథీ లో అభ్యర్థుల ఎంపికలో జాప్యం.. స్పష్టమైన వ్యూహం, ప్లానింగ్ లేకపోవడం. ఇది కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలను పెంచింది. చాలా ఆలస్యంగా అమేథీ నుంచి కాక, రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించు కోవడంతో కాంగ్రెస్ కేడర్ షాక్ తింది. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి , రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. తీరా ప్రియాంక అసలు పోటీ చేయరని ప్రకటించి, రాహుల్ రాయ్ బరేలీనుంచి నామినేషన్ వేశారు. అమేధీ నుంచి కేదార్ నాథ్ శర్మ ను కాంగ్రెస్ తరుపున స్మృతి ఇరానీపై పోటీకి దించడంతో. 2019లో రాహుల్ నే ఓడించిన స్మృతికి బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చేశారనే భావన కార్యకర్తల్లో నెలకొంది.రాహుల్ గాంధీ రాయ్ బరేలీలో ఏమేరకు విజయం సాధిస్తారు. కనీసం ఇక ముందైనా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కృషి చేస్తుందా. మోది అండ్ కో వ్యూహాత్మక రాజకీయాలను ఎదుర్కొంటుందా.. లేక కమల దళానికి 139 ఏళ్ల పార్టీ సరెండరై పోతుందా.. చూడాలి.

Latest Articles

ఆ ప్రశ్నకు ‘ల‌వ్‌, మౌళి’లో సమాధానం దొరుకుతుంది: నవదీప్

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్