28.9 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

కోనసీమ జిల్లాను వణికిస్తున్న వరదలు

వందలాది గ్రామాల్లో పొలాలు, కొబ్బరి తోటలు అంతరించిపోతున్నాయి. కళ్ల ముందే పొలాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడనుకుంటున్నారా…! అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో. ప్రతీ ఏటా కళ్ల ముందే తమ భూములు నదిలో కలిసిపోతుంటే రైతులు కంట నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మాత్రం మారడం లేదని రైతులు వాపోతున్నారు.

అందమైన ప్రకృతికి ఆనవాలమైన కోనసీమను వరదలు చిగురాటుకులా వణికిస్తున్నాయి. ఏడాదిలో రెండు నెలలో, మూడు నెలలో వరదలు వచ్చేది. ఆ మాత్రానికే కోనసీమ జిల్లా లంక గ్రామాల్లోని రైతులు తమ భూములు కోల్పోతారు. తరతరాలుగా తమకు పట్టెడన్నం పెట్టిన భూములు నదీ గర్భంలో కలిసిపోతూంటే గోదారమ్మకు దండం పెట్టడం తప్ప ఆ రైతులు చేసేదేమీ లేకుండాపోతోంది.

కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గానికి చరిత్రలో చాలా పేరుంది. ఏ ప్రభుత్వమైనా ఇట్టే గుర్తించే నియోజకవర్గం ఇది. ఆధ్యాత్మిక కేంద్రం కూడా. దేశానికి బాలయోగి వంటి స్పీకర్‌ను ఇచ్చిన నియోజకవర్గం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని కళ్లారా చూసిన పర్యాటకులు మురిసిపోతారు. ఇదంతా ఈ నియోజకవర్గం వైభవం. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. మరో వైపు అన్నదాతల కన్నీరు. ప్రతి ఏటా జూన్‌ నుంచి ఆగస్టు వరకూ ముమ్మిడివరంలోని లంక గ్రామాల రైతులకు భయం.. వణుకు పట్టుకుంటాయి. ఈసారి కూడా అదే జరుగుతోంది. ప్రతీసారీ ముమ్మిడివరం రైతులకు అలాగే జరుగుతోంది.

ముమ్మిడివరం నియోజకవర్గంలో గురజాపులంక, కమిని, పొట్టిలంక, వలసలతిప్ప, కొత్తలంక, సలాదివారిపాలెం లంక గ్రామాలు ఉన్నాయి. చుట్టూ నీరు, మధ్యలో గ్రామాలు. ఆ గ్రామాల్లోనే కొబ్బరి తోటలు, కూరగాయల భూములు, పండ్ల తోటలు విస్తారంగా ఉంటాయి. బయటి ప్రపంచానికి అదో అద్భుతమైన దీవి. కానీ లంక గ్రామాల ప్రజలకు మాత్రం వర్షా కాలం వచ్చిందంటే తోటలు, భూముల్లో ఏవి నదీ గర్భంలో కలిసిపోతాయో అనే భయం వెంటాడుతుంది.

ఈ లంక గ్రామాల్లోని కొబ్బరి తోటలు, వేలాది ఎకరాల పొలాలు దశాబ్దాలుగా నదీ గర్భంలో కలిసిపోయాయి. ప్రభుత్వం కాగితాల మీద, రైతుల ఇళ్లల్లోనూ దస్తావేజులు ఉంటాయి. అయితే.. ఆ భూమి మాత్రం కంటికి కానరాదు. నిన్న చూసిన పొలం కళ్ల ముందే నదిగా మారిపోతుంది. రైతుకు ఏది తన పొలమో, ఏది నదీ పాయో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు.

గతేడాది వరదల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చారు. గోదావరికి రివిట్‌మెంట్‌ ఏర్పాటు చేస్తామని అక్కడే ప్రకటించారు. ఇందుకోసం అప్పటికప్పుడు 150 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. పదిహేను రోజుల్లో పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఇన్ని చెప్పి.. అలా వెళ్లారు. నదిలో పొలాలు కలిసిపోయినట్లుగానే ఆ హామీ కూడా నదిలో కొట్టుకుపోయింది. పనులేవీ ప్రారంభం కాలేదు. మళ్లీ ఏడాది పూర్తి అయ్యింది. మళ్లీ వరదలు వచ్చాయి. మళ్లీ తోటలు, పొలాలు నదీ గర్భంలో కలిసిపోయే రోజులు వచ్చాయి. మీడియా ప్రచురించే, ప్రసారం చేసే వార్తల్లో ఇప్పటికైనా అని రాస్తారు. ఈ నదీగర్భంలో పొలాలు కలిసిపోవడాన్ని కూడా దశాబ్దాలుగా ఇప్పటికైనా అని రాస్తూనే ఉన్నారు. మీడియాలో ఈ వార్తలు తప్పడం లేదు. నదిలో పొలాలు కలిసిపోవడమూ ఆగలేదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్