సాక్షి పత్రికకు అడ్డంగా దోచి పెట్టారు – ధూళిపాళ్ల నరేంద్ర

గత ప్రభుత్వం వార్త ప్రకటనల కోసం 850 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పత్రికలు, మీడియాపై చర్చించారు. జగన్ సర్కార్ సాక్షి పేపర్‌ను అడ్డుపెట్టుకుని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆనంద్‌బాబు. జగన్ మీడియాను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా ప్రభుత్వ ప్రకటనలపై గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం పత్రికల ప్రకటన విషయంలో పక్షపాత ధోరణి వ్యవహరించిందన్నారు. ఐదేళ్ల పాటు ఈనాడుకు 190 కోట్లు, సాక్షికి 290 కోట్లు, ఆంధ్రజ్యోతికి మాత్రం 21 లక్షలే ఇచ్చారని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ఏబీసీ నిబంధనలకు పాతరేసిందన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సైతం గత ప్రభుత్వంలోని వార్త ప్రకటనలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం మారినా అధికారుల ధోరణి మారలేదన్నారు. ప్రకటనల విషయంలో పక్షపాత ధోరణి కనిపిస్తోందని.. సర్క్యూలేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వకుండా సాక్షి పత్రికకు అడ్డంగా దోచి పెట్టారని తెలిపారు.

Latest Articles

జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం

జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్