వైసీపీ పాలన వలన ఆర్ధిక వ్యవస్థ ధ్వంసమైంది – చంద్రబాబు

ఐదేళ్ల వైసీపీ పాలన ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని, ఆర్థిక అవకతకలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై, వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సరైన విధానం లేకుండా రాష్ట్ర విభజన జరగడంతో.. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. రాజధానిగా హైదరాబాద్ ను కోల్పోవడంతో.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వస్తే.. 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆదాయం వస్తోందన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌కి వెళ్లాయన్నారు చంద్రబాబు. పునర్విభజన చట్టంలో షెడ్యూల్‌ 9, 10 సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న సీఎం.. సేవల రంగం తెలంగాణకు వెళ్తే.. ఏపీకి వ్యవసాయ వచ్చిందన్నారు.

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్ బిల్స్ 1 లక్షా 35 వేల కోట్లు పెండింగ్స్‌ బిల్స్‌ ఉన్నాయన్నారు. మొత్తం బాకీలు పెట్టి, దోచుకుని, జగన్ రెడ్డి వెళ్ళిపోయారని ఆరోపించారు. ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడిందన్నారు. చివరకు డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులు కూడా డైవర్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఒక్క ఆస్తి కూడా వదిలి పెట్టలేదన్న చంద్రబాబు…కాలేజీలు, రైతు బజార్లు, పోలీస్ క్వార్టర్స్ లాంటి ప్రతి ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారని తెలిపారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్