ఈనెల 20 తర్వాత పిఠాపురంలో పర్యటిస్తా- పవన్‌

  జనసేన అధినేత, మంత్రి పవన్ కల్యాణ్ త్వరలో పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం పర్యట నకు సంబం ధించి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజక వర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో గెలిచారు. ఎన్నికల్లో జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకుంది.

త్వరలోనే జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అన్ని వైపుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగానికి చెందిన వారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారని చెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్.రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. ఇందుకు సంబం ధించిన షెడ్యూల్ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియ చేస్తామన్నారు. తనకు అభినందనలు తెలియ చేయడానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్