ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేయాలి కానీ.. ఇలా ప్రతిపక్షనేతలపై దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభా నాయకుడిగా చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని సీఎం జగన్ మీద ఉందన్నారు. జీవో నెంబర్ 1పై చర్చకు పట్టుబట్టిన టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతల దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడం దారుణం అన్నారు.
Read Also: ప్రధాని మోదీతో ముచ్చటించిన ఏపీ విధ్యార్థులు.. బహుమతిగా ఏమి ఇచ్చారంటే?
Follow us on: Youtube Instagram