Niharika Chaitanya |మెగా ఫ్యామిలీలో మరో జంట విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జొన్నలగడ్డ చైతన్యతో 2020లో విహహం జరిగింది. వివాహం జరిగిన రోజు నుంచి సోషల్ మీడియాలో ఎంతో అప్యాయంగా ఉన్నా ఈ జంట కొంతకాలంగా సైలెంట్ అయింది. వెకేషన్స్, పార్టీలంటూ జంటగా తిరిగే వీళ్లిద్దరూ ఈ మధ్య అసలు బయట కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇక చైతన్య అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేశాడు.
Niharika Chaitanya |నిహారికతో కలిసి ఉన్న పిక్స్ సైతం డిలీట్ చేయడంతో బ్రేకప్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారని తెలుస్తోంది. చైతన్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇకపై కలిసి ఉండేలా చిరు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరోవైపు వీరి విడాకుల వార్తలపై మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఏపీ స్పీకర్ తమ్మినేని రూలింగ్… పోడియం దగ్గరికి వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్
Follow us on: Youtube Instagram