Heart Attack |ప్రస్తుత రోజుల్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఉన్నచోటే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా యువత, చిన్నపిల్లలు సైతం గుండెపోటుతో మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. ప్రముఖ సీబీఎన్(CBN) న్యూస్ ఛానల్ లో యాంకర్ అలిస్సా ష్వార్ట్జ్ వార్తలు చదువుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకి గురై కిందపడిపోయింది. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: విడాకుల దిశగా నిహారిక-చైతన్య జంట.. రంగంలోకి మెగాస్టార్?
Follow us on: Youtube Instagram