Viveka Murder Case |మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ స్థానంలో మరో అధికారిని నియమించాలని కోరుతూ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసు దర్యాప్తును ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది. మరొక అధికారిని నియమించడంపై సీబీఐ(CBI) డైరెక్టర్ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం కేసు తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
Read Also: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్
Follow us on: Youtube Instagram