సీఎం కేసీఆర్(CM KCR) పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ సందేశం పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే బాగుంటే సరిపోదని.. దేశం మొత్తం బాగుండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశం కోసం ముందుకు పోదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 14 ఏళ్లు సుదీర్ఘంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.. అనుకున్న విధంగానే ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామన్నారు.
నాడు కరువుతో అల్లాడిన తెలంగాణ.. నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని పేర్కొన్నారు. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలమని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన బీఆర్ఎస్(BRS) పై బీజేపీ బరితెగింపు దాడులు చేస్తోందన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం.. నిరంతరం ప్రజల్లో ఉండాలని.. పనికిమాలిన పార్టీల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశం కోసం జరిగే పోరాటాలు అన్నింటిలో ధర్మమే జయిస్తుంది అని కేసీఆర్(CM KCR) ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు.
Read Also: వివేకా హత్య కేసు దర్యాప్తు జాప్యంపై సుప్రీం సీరియస్
Follow us on: Youtube Instagram