కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారంలో బిజీ బిజీ అయ్యారు. ఇప్పటికే ప్రధాని మోదీ మాండ్యలో పర్యటించగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బెళగావిలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువక్రాంతి సమావేవంలో రాహుల్ పాల్గొని పలు హామీలు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులైన పట్టభద్రులకు రెండేళ్ల పాటు నెలకు రూ.3వేలు, డిప్లొమా వారికి రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాన్నరలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. మొత్తమ్మీద 10లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో ఏదైనా పని జరగాలంటే 40శాతం కమీషను ఇవ్వాల్సిందేనంటూ రాహుల్ ఆరోపించారు.
అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి
0
313
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


