లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటల పాటు సుదీర్ఘంగా ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్నం అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి విచారించిన అధికారులు.. సాయంత్రం మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాలతో కలిపి కవితను విచారణ చేశారు. రాత్రి తొమ్మిది గంటలు అయినా ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఎట్టకేలకు ఆమె విచారణ ముగించుకుని బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు.