వివేకా హత్య కేసు దర్యాప్తు జాప్యంపై సుప్రీం సీరియస్

Viveka Murder Case |మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ స్థానంలో మరో అధికారిని నియమించాలని కోరుతూ నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసు దర్యాప్తును ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది. మరొక అధికారిని నియమించడంపై సీబీఐ(CBI) డైరెక్టర్ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం కేసు తాజా పరిస్థితిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

Read Also: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

భారత్‌లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్‌ కళ్యాణ్‌

తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్