Free Porn
xbporn
25.2 C
Hyderabad
Friday, October 11, 2024
spot_img

Naveen Murder Case |విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన నిహారిక

Naveen Murder Case |తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడిని చంపి, ఆపై శరీరం నుండి అతని అవయవాలను వేరు చేసి ప్రియురాలికి పంపించడం అందరిని నిర్ఘాంతపోయేలా చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిహరికృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ హత్యకేసులో ప్రియురాలు నిహారిక హస్తం కూడా ఉందన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలికితీశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నిహారిక సంచలన విషయాలు బయట పెట్టింది. ఆమె ఏం చెప్పిందో పూర్తిగా తెలుసుకుందాం.

నిహారిక కన్ఫెషన్ స్టేట్మెంట్…

ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్ళం. నవీన్ నేను గొడవ పడితే హరిహర కృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్ తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని. నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నవీన్ నాతో మాట్లాడటం నచ్చని హరి హరికృష్ణ ఒకసారి.. నవీన్ ను చంపేసి, నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని నేను మందలిస్తే సరదాగా అన్నాను అన్నాడు.

కొన్ని రోజుల తర్వాత హరిహర కృష్ణ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నవీన్ ను చంపడానికి కొన్న కత్తిని, రెండు జతల గ్లౌజ్ లను తీసి నాకు చూపించాడు. ఇవి నవీన్ ని చంపడానికని నాతో చెప్తే నేను నమ్మలేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అలాంటివి చేయకు.. జైలుకు వెళ్తావు.. నేను అతనితో మాట్లాడట్లేదు కదా.. అతనే నన్ను మరిచిపోతాడు.. అలాంటి పిచ్చి పనులు చేయకు అని హరిని మందలించాను. దాంతో హరి.. నేను ఊరికే సరదాకి అన్నాను అని చెప్పాడు.

జనవరి 15న హరి నాకు ఫోన్ చేసి.. తన స్నేహితులందరూ జనవరి 16న గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాము అని చెప్పాడు. నవీన్ కూడా వస్తున్నాడని చెప్పాడు. కానీ తర్వాత రోజే హరి ఫోన్ చేసి వారి పార్టీ క్యాన్సిల్ అయిందని చెప్పాడు. ఫిబ్రవరి 17న ఉదయం 9:40 గంటలకి నవీన్ తన ఫోన్ నుంచి హైదరాబాద్ వస్తున్నాను అని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హరి నాకు ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడు. నవీన్ కాల్ చేస్తే నేను వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నానని చెప్పమన్నాడు. నేను కూడా నవీన్ తో అదే విషయం చెప్పాను. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను.

ఆ తర్వాత హరి నాకు కాల్ చేసి నవీన్ ఇంకా నీతో మాట్లాడడంట అని అంటే నేను సరే అన్నాను. మరుసటి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి నన్ను కలవాలని నాకు మెసేజ్ చేశాడు. దీంతో శివరాత్రి రోజున ఉదయం 9:30 కి వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీద హరిని కలిసాను. అప్పుడు హరి పాత బట్టలు వేసుకుని వచ్చాడు. ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు? ఎవరివి ఈ బట్టలు? అని అడిగాను. అప్పుడు హరి.. నవీన్ ని నేను రాత్రి చంపేశాను. నా బట్టలకు రక్తం అంటితే హసన్ బట్టలు వేసుకున్నాను. హసన్ కి కూడా నవీన్ హత్య విషయం చెప్పాను. హసన్ తో కలిసి నవీన్ అవయవాలు ఉన్న బ్యాగ్ ని వారి ఇంటికి దూరంగా.. చెట్లలో పడేశామని నాతో చెప్పాడు. నేను అతనితో ఎందుకు అలా చేసావు? వేరే లాగా మాట్లాడుకుని ఉండొచ్చు కదా అన్నాను.

ఆ తర్వాత హరి వరంగల్ వెళ్తాను డబ్బులు కావాలి అని అడిగితే నేను హరికి 1500 ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పాను. అప్పుడు హరి.. మా నాన్న దగ్గరికి వరంగల్ వెళ్తాను అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం నేను నవీన్ స్నేహితులకు కానీ, పోలీసులకు కానీ, ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాను. ఫిబ్రవరి 20వ తేదీ రోజున నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా… హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్ లో నన్ను కలిసాడు.

కొద్దిసేపు నాతో మాట్లాడి.. నవీన్ ని చంపిన చోటుని, తల పడేసిన చోటుని చూపిస్తానని చెప్పి.. అతని బండిమీద ఎక్కించుకొని బి.ఎన్.రెడ్డి నగర్ మీదుగా సాగర్ కాంప్లెక్స్ దగ్గర చెత్త పడేసిన చోట హరి బట్టలు పడేసిన చోటుని చూపించాడు. అక్కడి నుండి రాజీవ్ గృహకల్ప దగ్గర బ్యాగ్ పారవేసిన ఏరియాను, ఆ తర్వాత.. బ్రాహ్మణపల్లి దగ్గర ఒక కంపెనీ ప్రక్కన నవీన్ తలని, అతని ప్యాంటు, కత్తిని, సెల్ ఫోన్ పడేసిన ప్లేస్ ని హరి నాకు దూరం నుండి చూపించాడు. అక్కడి నుండి ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్డుమీదుగా వెళ్లి… అబ్దుల్లాపూర్మెట్ లో అమృత ఫ్యామిలీ డాబా లో నేను, హరి ఇద్దరం సాయంత్రం 4:30 గంటలకు బిర్యానీ తిన్నాము. అక్కడి నుండి తిరిగి వస్తూ నవీన్ ను చంపిన ప్లేస్ ఇటువైపు అని దారిలో నాకు చూపించి.. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి హరి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

నాకు నవీన్ వాళ్ళ ఫ్రెండ్ తరుణ్ కాల్ చేసి… నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నిన్న హైదరాబాద్ కి వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్ ని కలవడానికి  వచ్చాడు… నీకేమన్నా కలిసిండా అని అడిగాడు. నవీన్ ని హరి చంపిన విషయం దాచిపెట్టి… నాకు నవీన్ గురించి తెలియదు అని చెప్పాను. అతను నన్ను మీ కామన్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట కదా.. అతని ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగితే.. నేను హరి ఫోన్ నెంబర్ మెసేజ్ చేశాను.

ఫిబ్రవరి 21వ రోజు ఉదయం 10 గంటలకు నవీన్ వాళ్ళ మామ హరి కి ఫోన్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి రమ్మని అడిగారని.. హరి నాతో అన్నాడు. అప్పుడే హరి తన ఫోన్ స్విచాఫ్ చేసుకుంటాను.. ఎవరి ఫోన్ తోనైనా నేను ఫోన్ చేసి అప్పుడప్పుడు నీతో ఫోన్లు మాట్లాడుతూ నవీన్ విషయం తెలిసిందా అని తెలుసుకుంటాను అన్నాడు. ఏదైనా ఉంటే హసన్ తో ఫోన్లో టచ్ లో ఉండమని హరి నాకు చెప్పాడు. తర్వాత తన ఫోన్ స్విచాఫ్ చేసి వెళ్ళిపోయాడు.

అదే రోజు సాయంత్రం మళ్లీ తరుణ్ నాకు కాల్ చేసి… నవీన్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే నాకు తెలియదు అని చెప్పాను. నవీన్ వాళ్ళ మామ కూడా నాకు ఫోన్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పాను కానీ నాకు భయం వేసి, మా బావ భూపాల్ రెడ్డికి జరిగిన విషయం చెప్పకుండా దాచిపెట్టి… నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడు.. నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పాను.

అప్పుడు మరల నవీన్ వాళ్ళ మామ నాకు ఫోన్ చేసి.. నవీన్ గురించి అడుగుతుంటే.. మా బావ భూపాల్ రెడ్డి నా ఫోన్ తీసుకొని అతనితో మాట్లాడి మీ అబ్బాయి గురించి మాకు తెలియదు. నేను అడ్వకేట్ ని పదేపదే నిహారికకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు. ఆ తర్వాత నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఫిబ్రవరి 23 న నేను హసన్ కు కాల్ చేస్తే.. హరి మిస్సయ్యాడని, వాళ్ళ అక్క బావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్లని, నన్ను పోలీస్ స్టేషన్ కి పిలుస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయ్.. నిన్ను కూడా పోలీస్ స్టేషన్ కి పిలుస్తారేమో అని హసన్ నాతో చెప్పాడు.

అప్పుడు నేను కొంత చాట్ ని, ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ లు అన్నీ డిలీట్ చేశాను. మరుసటి రోజు ఫిబ్రవరి 24వ  తేదీన నా ఫ్రెండు కి హసన్ నుండి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చింది. నిహారికని ఎవరికీ ఫోన్ చేయవద్దు… ఎవరితో మాట్లాడవద్దు… హరి గురించి ఎవరైనా అడిగితే తెలియదు అని చెప్పమని నా ఫ్రెండ్ కి హసన్ మెసేజ్ చేసాడు. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పింది.

ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం సుమారుగా 8:30 గంటలకు నేను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్ లో బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తుంటే హరి వచ్చి బస్సు దగ్గర నిలబడి ఉన్నాడు. నా ఫ్రెండ్ హరిని చూసి నాకు చెప్పింది… వెంటనే నేను బస్సు దిగాను. అక్కడ కొద్దిసేపు హరి నాతో మాట్లాడి… నేను పోలీసులకు లొంగిపోతాను అన్నాడు. హరి నా ఫోన్ నుండి హసన్ కి ఫోన్ చేసి… బ్రాహ్మణపల్లి గేట్ దగ్గరికి రమ్మని చెప్పి.. నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత నాకు హరి మధ్యాహ్నం ఒంటిగంటకు కాల్ చేసి నన్ను హస్తినాపురం బస్ స్టాప్ వద్ద ఉండమంటే నేను అక్కడ వెయిట్ చేసాను. హరి వచ్చి నన్ను కలిశాడు. నవీన్ తల, అతని శరీర భాగాలు, బట్టలు తీసుకెళ్లి అతనిని చంపిన దగ్గరనే వేయి… లేదంటే మాపైన కూడా అనుమానం వస్తది అని హసన్ చెప్పినట్టు హరి నాతో అన్నాడు.

తర్వాత హరి, హసన్ ఇద్దరూ కలిసి రాజీవ్ గృహకల్ప వెనకాల పడేసిన బ్యాగు దగ్గరికి వెళ్లి.. బ్యాగు తీసుకుని  బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్లారు. అక్కడ నవీన్ కుళ్ళిపోయిన తలని ఖాళీ ప్లాస్టిక్ బియ్యం సంచిలో పడేసి రమ్మని హసన్ హరికి చెప్పాడు. దీంతో ఆ సంచిని, నవీన్ అవయవాలతో ఉన్న బ్యాగ్ ని హరి ఒక్కడే బండిమీద నవీన్ ని హత్య చేసిన ప్లేస్ కు వెళ్లి .. తలను మొండం దగ్గర పడేసినట్లు నాతో హరి చెప్పాడు.

తర్వాత తన బండి బాగా దుర్వాసన వస్తుందని సాయిబాబా గుడి దగ్గర ఉన్న బైక్ సర్వీసింగ్ పాయింట్ లో బైక్ సర్వీసింగ్ కి ఇచ్చానని హరి నాతో చెప్పాడు. తర్వాత ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళాము. హరి మా ఇంట్లోనే స్నానం చేశాడు. మా బావ అడ్వకేట్ అయినందున.. అతనితో మాట్లాడాలని హరి చెప్పగా… అప్పుడు నేను మా బావ భూపాల్ రెడ్డి ని రోడ్డు మీదకు పిలిచి హరితో మాట్లాడించాను. హరి మా బావతో నవీన్ మర్డర్ విషయం చెప్పాడు. దీంతో మా బావ.. ఇది పెద్ద కేసు వెంటనే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలని హరితో చెప్పాడు. అనంతరం హరి వెళ్లి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 24 న లొంగిపోయాడని తెలిసింది.

Read Also: ప్రీతి సూసైడ్ కేసు.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న సైఫ్!

Follow us on:   Youtube   Instagram

Latest Articles

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నూతన సినిమా

మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాతగా, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్