హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద పోలీసులపై దాడి చేసిన ఘటనలో వైసీపీటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. అంతకుముందు విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడంతో షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కాసేపటి క్రితం ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా షర్మిలకు రిమాండ్ విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది.
Also Read: షర్మిల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు


