దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్ పుట్టింది: కేసీఆర్

ఒక్క కులం, మతం కోసం బీఆర్ఎస్ పార్టీ ఫుట్టలేదని.. దేశంలో మార్పు కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్వంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎందరో మహనీయులు జన్మించిన మహారాష్ట్ర గడ్డలో తాగేందుకు నీళ్లు లేకపోవడం బాధాకరమన్నారు. గోదావరి, కృష్ణా నదులతో పాటు దేశ ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్రలో నీటి సమస్యలెందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఎందరి ప్రధానులు వచ్చినా దేశ ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సాగు, తాగు నీరుతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోని పేదలు మరింత పేదరికంలో కురుకుపోతుంటే.. సంపన్నులు మాత్రం మరింత సంపన్నులు అవుతున్నారని మండిపడ్డారు. దేశ భ‌విష్య‌త్ యువ‌త‌పై ఆధార‌ప‌డి ఉందని.. ఎంత త్వ‌ర‌గా మేల్కొంటే అంత త‌ర్వ‌గా బాగుప‌డుతామన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని వెల్లడించారు. మీ సమస్యల పరిష్కారం కావాలంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ కోరారు.

Latest Articles

పరుగులు తీస్తూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక… హార్ట్‌ఎటాక్‌

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలిక తన స్నేహితులతో కలిసి భోజనం చేసింది. అనంతరం ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్