రేవంత్ రెడ్డి టీమ్ సభ్యునిగా నా ఫోన్ ట్యాప్ చేశారు- చామల

ఫోన్ ట్యాపింగ్ అంశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ” ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ అధికారులు పిలిచారు. జులై 2023లో నా ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు నాకు తెలిపారు. నేను అప్పుడు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ గా ఉన్నాను. నాటి పీసీసీ చీఫ్ నేటి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నాను. హార్డ్ డిస్క్ ఆధారంగా నా ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పారు. రేవంత్ రెడ్డి టీమ్ సభ్యునిగా నా ఫోన్ ట్యాప్ చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంట్లో వాళ్ళ ఫోన్లు బిఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేశారు. హరీష్ రావు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ఆయన ఫోన్ ట్యాప్ అయింది. హరీష్ రావు తన డ్రైవర్, పీఏను మార్చుకున్నారు. కవిత తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఓపెన్ గా చెప్పారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరు. స్వంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక లెక్కనా?. తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా చేశారు. 2018లో 88 సీట్లు బిఆర్ఎస్ పార్టీకి వచ్చినా ఫోన్లు ట్యాప్ చేసి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో కేసీఆర్ కు అర్ధం కాలేదు. కేసీఆర్ అన్ని వ్యవస్థలను వాడుకుని ఎప్పటికీ అధికారంలో తానే ఉండాలని అనుకున్నారు. అధికారం పోయే సరికి ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ రోడ్డు ఎక్కారు. సిట్ అధికారులు చెప్పింది ప్రజలు వింటే ఆశ్చర్యపోతారు. వేల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రయివేటు సంభాషణలను విన్నారు. వ్యాపారవేత్తలు, మీడియా అధినేతలు, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. బిఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం బంద్ చెయాలి. బిఆర్ఎస్ పదేళ్లలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి శిక్ష పడాలి”.. అని అన్నారు.

Latest Articles

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..

భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్ అందించింది. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌ నగరంలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల వర్షం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్