ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో భారీ చిత్రాన్ని అనౌన్స్ చేయడం తెలిసిందే. అనౌన్స్ మెంట్ వీడియోతోనే యూట్యూబ్ ని షేక్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే.. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. ఇంతకీ.. ఇది నిజమా..? లేక గాసిప్పా…? వైరలైన ఈ న్యూస్ వెనకున్న రియాల్టీ ఏంటి..?
సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వార్తలు, రకరకాల వీడియోలు ప్రచారంలోకి రావడం.. వెంటనే వైరల్ అవ్వడం జరుగుతుంది. దీంతో.. వైరలైన వార్త నిజమో… కాదో చెప్పడం కష్టంగా మారింది. వైరలైన వార్తల వలన అందులో నిజం లేకపోతే.. క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేటెస్ట్ గా అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో రావాల్సిన భారీ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే… ఈ వార్త గురించి మేకర్స్ నుంచి క్లారిటీ లేకపోవడంతో.. అది నిజమా..? లేక గాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ ప్రచారానికి పరోక్షంగా ఫుల్ స్టాప్ పడింది. రైటర్ రత్నకుమార్ తాజాగా ఈ పుకార్లకు చెక్ పెడుతూ ‘#AA23’ ప్రాజెక్ట్ ఇంకా లైన్‌లోనే ఉందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే.. ఆయన డైరెక్ట్ గా పుకార్లపై స్పందించలేదు. అయితే.. విక్రమ్ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన సంతోషాన్ని షేర్ చేస్తూ ట్వీట్ వేశాడు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. దీనికి రైటర్ రత్నకుమార్ స్పందించాడు. లోకేష్‌ను అభినందిస్తూ… తాను AA23 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
రైటర్ రత్నకుమార్ స్పందనతో అల్లు అర్జున్, లోకేశ్ సినిమా ఆగిపోలేదనే విషయం పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ప్రకటనలో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. మరీ ముఖ్యంగా దీనికి అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎంతో మంది తమ రింగ్ టోన్స్ గా దీన్ని పెట్టుకున్నారంటే.. ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అక్టోబర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారని సమాచారం. మరి.. బన్నీ, లోకేష్ కనకరాజ్ కలిసి ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.


