జనసేన పార్టీలో చేరనున్న మండలి బుద్ధప్రసాద్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇవాళ జనసేన పార్టీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకోనున్నారు బుద్ధప్రసాద్. ఈరోజు ఉదయం 11 గంటలకు హైద రాబాద్ లో పవన్ కల్యాణ్ సమక్షంలో బుద్ధప్రసాద్ చేరనున్నారు. బుద్ధప్రసాద్ రాకతో అవనిగడ్డ నియోజ కవర్గంలో గెలుపు ఖాయమని కూటమి నేతలు అంటున్నారు.

అవనిగడ్డ నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్‌ గట్టిగా ప్రయత్నించారు. విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బుద్ధప్రసాద్‌తో పాటు పలువురి పేర్లు తెరమీ దకు వచ్చాయి.1999,2004,2014 ఎన్నికల్లో గెలిచిన బుద్ధప్రసాద్‌కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు టికెట్‌ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని జనసేన పార్టీ భావించి నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం కూటమి లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా బుద్ధప్రసాద్‌కు జనసేన టికెట్‌ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మండలి బుద్ధప్రసాద్ జనసేనాలో చేరుతున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్