కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు

ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు ఏఐసీసీ నేతలు. తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థులపై చర్చించ నున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ, మరో నాలుగు పార్లమెంట్ నియోజకవ ర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌ ఢిల్లీలో జరిగే సీఈసీ మీటింగ్‌కు హాజరవుతున్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు పెండింగ్ లో ఉన్న వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై చర్చిం చనున్నారు.

తెలంగాణలో ఇప్పటికే 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సీఈసీ.. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు జరిగే భేటీలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ నాలుగు స్థానాలపై ఇప్పటికే స్క్రీనింగ్​ కమిటీ చైర్మన్​హరీశ్​ చౌదరి నేతల అభిప్రాయాలను సేకరించారు. సీఈసీ భేటీలో ఈ నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనుండటంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు వరంగల్ నుంచి కడియం కావ్యకి టికెట్ కన్ఫర్మ్ చేయనున్నారు. ఇక, ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద రెడ్డి ప్రధానంగా పోటీపడుతున్నారు. ఇవాళ జరగనున్న మీటింగ్‌లో ఈ నాలుగు స్థానాలపై క్లారిటీ రానుంది.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్