ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా ?

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఇవాళ రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ పిటిషన్‌ను విచారణ చేయబో తున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌, మనీలాండరింగ్‌ కేసులో మార్చి 26న కవిత మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందు వల్ల తనకు ఏప్రిల్‌ 16 వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత కోరారు. కవితకు మధ్యంతర బెయిల్‌పై ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు ఈడీని వివరణ కోరింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోరే అవకాశం ఉంది. కవిత బెయిల్‌ ఇస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ భావిస్తోంది. మరోవైపు కవితకు జైల్లో సదుపాయాలు కల్పన అంశంపై కూడా నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. కవితకు జైల్లో సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల కవిత తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కవితకు ఇంటి భోజనం, నిద్రించడానికి మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. కానీ తిహార్‌ జైలు అధికారులు అమలు చేయకపోవడంపై మరోసారి కోర్టును ఆశ్రయించారు కవిత.

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్