ఒక రోజు విరామం తర్వాత ఇవాళ మళ్లీ ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మేమంతా సిద్దం పేరుతో చేస్తున్న బస్సు యాత్ర ఇవాళ ఐదో రోజు అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. కాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, NSP కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుం టారు.పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా వెళ్లి చీకటిమనిపల్లెలో రాత్రి బస చేస్తారు.
నేడు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర
0
308
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


