వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోశాలకు మహర్దశ వచ్చిందని భక్తులు అంటున్నారు. గోశాలతో పాటు అందు లోని కోడెల దుస్థితిపై స్వతంత్ర టీవీ ఛానల్లో కొద్ది రోజుల నుండి వరుస కథనాలు వెలువడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజన్న గోశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కోడెల సంరక్షణ కోసం పశు సంవర్ధకశాఖ మెగా హెల్త్‌క్యాంప్ నిర్వహించింది. గోశాల అభివృద్ధికి దేవాదాయశాఖ నుంచి కోటీ 11 లక్షల రూపాయలు మంజూరైన ట్లు ఆలయం అధికారులు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో మాడ్రన్ గోశాలగా తీర్చిదిద్దుతామని పర్యవేక్షకుడు నాగుల మహేష్ చెప్పారు. వరుస కథనాలు ప్రసారం చేసిన స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, నిధుల కోసం కృషిచేసిన ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌కు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాజన్న గోశాలకు మహర్దశ
0
297
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


