కూకట్ పల్లి , శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తారమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ రోజా రంగారావు పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో రాష్ట్ర ప్రజల కలాలు నెరవేర్చాలని ఆకాంక్షించారాయన. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.