తెలుగు ప్రేక్షకులు తనను జాను పాప అని పిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఆ మేరకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేవర ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగులోనే మాట్లాడాలని ప్లాన్ చేసుకున్న ఆమె… ఈవెంట్ రద్దు కావడం గురించి స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులతో చెప్పాలనుకున్న మాటలను ఓ వీడియో ద్వారా తెలిపారు. అందులో జాన్వీ కపూర్ అచ్చ తెలుగులో మాట్లాడడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.
తనను ఇంతగా ఆదరిస్తున్నందుకు, ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ధ్యాంక్స్ చెప్పారు. జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇంతలా సపోర్ట్ చేస్తున్న అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతానని చెప్పారు జాన్వీకపూర్.