ISRO: అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారతదేశానికి ఉంది- సోమనాథ్

స్వతంత్ర వెబ్ డెస్క్: అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారతదేశానికి ఉందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ అన్నారు. అయితే అందుకు మనం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని చెప్పారు. ఇస్రో ప్రణాళిక గురించి ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలకు పెట్టుబడుల అవసరం ఉందని, దాని వల్ల అంతరిక్ష పరిశోధన రంగంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, ఇదే తమ లక్ష్యమని చెప్పారు.

దేశ అంతరిక్ష రంగ అభివృద్ధి గురించి ప్రధాని మోదీకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని సోమనాథ్ తెలిపారు. ప్రధాని తమకు నిర్దేశించిన భవిష్యత్ లక్ష్యాలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేరళలోని తిరువనంతపురంలో భద్రకాళి ఆలయాన్ని సోమనాథ్ సందర్శించారు. విక్రమ్ ల్యాండర్‌‌ దిగిన చోటుకు శివశక్తి అనే పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. శివశక్తి, తిరంగా పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు. సైన్స్, ఆధ్యాత్మిక అంశాలపై తనకు ఆసక్తి ఉందని చెప్పారు. చంద్రయాన్‌–3 ల్యాండర్, రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందని వివరించారు.

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్