ముగిసిన పొన్నం పర్యటన
మంత్రి పొన్నం ప్రభాకర్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి తెలంగాణకు వచ్చారు. ఈనేపథ్యంలోనే ఆయనకి కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్‌తోపాటు, నియోజకవర్గ కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన బాబు
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో యువతను ప్రోత్సహి స్తామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిని నియమిస్తామని తెలిపారు.
కవితను వెంబడిస్తున్న నిరాశ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత మరో నెల రోజులు జైలులో ఉండనున్నట్లు తెలు స్తోంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారీ ఆమెకు నిరాశే ఎదురవుతోంది. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్‌పై మే 27, 28న వాదనలు జరగ్గా తీర్పును కోర్టు రిజర్వు చేసింది. నేటి నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వు చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు.
కార్డెన్ సెర్చ్
కృష్ణా జిల్లా గుడివాడ ధనియాలపేట న్యూ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఉన్నచోట వారి వివ రాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు చోటుచేసుకుండా జిల్లా ఎస్పీ, స్థానిక డీఎస్పీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టామన్నా రు.
పోలీసుల ఫ్లాగ్ మార్చ్
అనంతపురంలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. దీనికి జిల్లా ఎస్పీ గౌతమిసాలి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్య లు చేపట్టామన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఎవరై నా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
నఖిలీ పోలీస్ హల్ చల్
అనంతపురం జిల్లా నక్కన దొడ్డి గ్రామ సమీపంలో ఓ ముగ్గురు యువకులు పోలీసులు అంటూ హల్చల్ చేశారు. బళ్లారి నుండి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీని ఆపి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ డబ్బులు లేవని చెప్పడంతో వారిపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు నిమిషాల వ్యవధిలోనే లచ్చనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి నుండి బొలెరో వాహనం స్వాధీనం చేసుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
బిర్యానీలో ప్లాస్టిక్ కవర్
బిర్యానీలో ప్లాస్టిక్ కవర్లను వండించిన సంఘటన సిద్ధిపేట జిల్లా పొన్నాల గ్రామ శివారులోని కింగ్ ప్యా లెస్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. ఓ వినియోగదారుడు రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందులో ప్లాస్టిక్ కవర్ చూసి అవాక్కయ్యాడు. ఇదేంటని హోటల్ నిర్వాహకులను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పడంతోపాటు తనపై దురుసుగా ప్రవర్తించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
భారీ చోరీ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ దొంగతనం కలకలం రేపింది. స్థానిక కొండారెడ్డి కాలనీలో బండారు తిరుపతమ్మ, బత్తుల తిరుపమ్మ ఇండ్లలో 6 లక్షల విలువ చేసే బంగారం, వెండి, 18వేల నగదు చోరీ జరిగింది. బాధితురాల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
కలకలం రేపిన మహిళ మృతదేహం
మేడ్చల్ జిల్లా ఆదర్శ్ నగర్ మినీ డంపింగ్ యార్డులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో జవహర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంత రం కేసు నమోదు చేసి హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించారు.
కుళ్లిన మృతదేహం
కుళ్లిన స్థితిలో ఓ మహిళ మృతదేహం మేడ్చల్ జిల్లా మల్లికార్జున నగర్‌లో కలకలం రేపింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉంది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సత్యనారాయణ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్న ఇంట్లో మహిళ మృతి చెందడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.