ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ నిరసనలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొనడంతో వాతావరణం మరింత వేడెక్కింది. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో చంద్రబాబు రోడ్ షో ప్రారంభం కానుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత.. చంద్రబాబు వర్సెస్ మంత్రి సురేష్
0
326
Previous article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


