34.3 C
Hyderabad
Sunday, April 20, 2025
spot_img

TSRTC : ఇకపై తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: టీఎస్ ఆర్టీసీకి కేసీఆర్ సర్కారు శుభవార్త వినిపించింది. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టు సర్కారు ప్రకటించింది.. 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సుదీర్ఘంగా సాగిన కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే బిల్లును ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ వివరించారు. అందుకు సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చినట్టు కేటీఆర్‌ తెలిపారు.

ఈ అంశానికి సంబంధించిన విధివిధానాలపై సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి వీలైనంత తొందరగా అందజేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
ఇక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని.. సంస్థలో ఉన్న దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవమని అభివర్ణించారు. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని సజ్జనార్ ఆశించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్