కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో పర్యటించిన ప్రధాని మోదీ…. సుపరిపాలన, కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండలేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సుపరిపాలనపై ఎన్నడూ ధ్యాస పెట్టలేదని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని 11 జిల్లాల ప్రజలకు ఈ ప్రాజెక్టు వల్ల తాగునీరు, సాగు నీరు లభిస్తాయన్నారు. నీటి వసతిని కల్పిస్తామంటూ బుందేల్‌ఖండ్ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి దగా చేశాయని ప్రధాని మోదీ వివరించారు.