ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు…. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో పలు అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశముంది. కేంద్ర మంత్రి కుమారస్వామి కలిసి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై చర్చించే అవకాశం ఉంది.