సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు వేషాన్ని వేసుకొని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు. బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సైనికులను కూడా కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసి మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంక్షతో కాంగ్రెస్ దేశాన్ని రెండు ముక్కలు చేసిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.