కాంగ్రెస్ నేతలకు అంబేడ్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ ఒత్తిడి మేరకు బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిందని తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి తాళాలు వేశారని తెలిపారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదన్నారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలి వెళితే తెలంగాణకే నష్టం అని బండి సంజయ్ హెచ్చరించారు.