పెద్దపల్లి జిల్లా నాగపల్లిలో గంజాయి కలకలం రేపింది. గ్రామంలో మత్తు మందు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి మూడు కిలోల గంజాయి, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలోనే భద్రాచలం ఏరియాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రామగిరి, మంథని పరిసర ప్రాంతాల్లో రహస్యంగా అమ్మకాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ రమేష్ తెలిపారు.
పల్లెల్లో గంజాయి కలకలం
0
260
Previous article
Next article
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


