వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కడప జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఆయన సమావేశమవుతారు. కడప జిల్లా నేతలతో ఆయన సమావేశమై పార్టీకి రానున్న కాలంలో భవిష్యత్ ఉంటుందని చెప్పనున్నారు. రెండు రోజుల పాటు జగన్ కడప జిల్లా నేతలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్థానిక సంస్థల నేతలకు వివరించనున్నారు. ఇతర పార్టీల వైపు చూడవద్దని, వైసీపీలో కొనసాగితే భవిష్యత్ ఉంటుందన్న భరోసా ఇవ్వనున్నారు.