పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. అందరినీ ఒప్పించి రాష్ట్రం సాధించారని.. ఫ్లోరైడ్ బాధను తీర్చిన మహానేత ఆయన అని అన్నారు. కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇచ్చారని.. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని అన్నారు. పదేళ్లలో లక్షా 65 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారని కేటీఆర్ తెలిపారు.
రైతు బంధుతో అన్నదాతకు వెన్నెముకలా నిలిచారని.. రేవంత్ 4 సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా సీఎం బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శలు చేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ అన్నారు.. ఏమైంది?.. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని జనం కోరుతున్నారు. తెలంగాణలో ప్రజలకు శాంతి లేదు, భద్రత లేదు. పట్టపగలే దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి… అని కేటీఆర్ ఆరోపించారు.


