ఏపీలో రేపటి పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. గుంటూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 19లక్షల 91వేల 543 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం యంత్రాంగం 13వేల 800 మంది సిబ్బందిని నియమించింది. 4వేల మంది పోలీస్ సిబ్బంది, 1,915 కేంద్ర బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక పల్నాడు జిల్లాలో సైతం పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. 2లక్షల 30వేల 572 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 245 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,929 కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. జిల్లా మొత్తం 60 వేల మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక 10వేల 800 మంది మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5.9 కోట్ల మద్యం, నగదు సీజ్ చేశామన్నారు ఆర్వో.
గుంటూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
0
193
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


