విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పోరాట కమిటీ డిమాండ్ చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుండి నగరంలోని జీవీఎంసీ వరకు పోరాట కమిటీ పాదయాత్ర నిర్వహించింది. కేంద్రప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షలు వెయ్యి 116 రోజులకు చేరాయి. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది.వచ్చే ఎన్నికలలో స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని మేనిఫెస్టోలో పెట్టిన రాజకీయ పార్టీలకే సహకరిస్తామని పోరాట కమిటీ సభ్యులు నినాదాలు చేశారు. పాదయాత్రలో మేయర్ హరికుమారి, నర్సింగరావు, రామచంద్రరావు, మస్తానప్ప, కార్మికులు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్‌ను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలని డిమాండ్
0
502
Previous article
Next article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


