చంద్రబాబు ఇంటి జప్తునకు అనుమతి కోరిన సీఐడీ.. నేడే విచారణ

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్​రోడ్డు ఎలైన్​మెంట్ మార్చడంలో అవినీతి జరిగిందన్న ఆరోపణతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని అటాచ్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు అనుమతి ఉత్తర్వులు పొందేందుకు విజయవాడలోని అనిశా కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు దాఖలు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచేశారు.

రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ మార్చడంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణతో గతేడాది మే నెలలో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు సీఐడీ.. విజయవాడ అనిశా కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్