30.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

జగన్‌ను బాగా అర్ధం చేసుకున్న చంద్రబాబు

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డిని.. ఆయన సతీమణి భారతి కూడా ఇంతలా అర్ధం చేసుకున్నారో లేదో తెలియదు కానీ.. చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనను పూర్తిగా అర్ధం చేసుకున్నారని నిన్న టీడీఎల్పీ సమావేశంలో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. విభజన తర్వాత మొదటి ఐదేళ్లు ఏపీని పాలించిన చంద్రబాబు.. తర్వాత ఓడిపోయారు. అప్పుడు జగన్‌ను తక్కువ అంచనా వేసి అధికారాన్ని కోల్పోయామని.. ఇప్పుడైనా జగన్‌ చేసే కుట్రలను అర్ధం చేసుకుని టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు చంద్రబాబు.

శుక్రవారం బడ్జెట్‌ తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో వివేకా నంద రెడ్డి హత్య, వైసీపీ ఎన్నికల కుట్రలపై చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్బంగా తమ పార్టీ నేతలకు జాగ్రత్తలు చెప్పారు. జగన్‌ గుణగుణాలను, ఆయనలోని ప్రత్యేకతలను, తెలివితేటలు, నైపుణ్యాలను కళ్లకుగట్టినట్టు విడమరిచి మరీ వివరించారు చంద్రబాబు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా జగన్‌ నుంచి ముప్పు ఎదుర్కోక తప్పదని ఓ రకంగా టీడీపీ నేతలను హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. వివేకానంద రెడ్డి హత్య, కోడికత్తి కేసు, ఇటీవల జగన్‌ ఇంటి ముందు గడ్డి తగలబడిన ఘటనలను ఉదహరిస్తూ ఆయన కుట్రలను వివరించే ప్రయత్నం చేశారు. వివేకానంద హత్యను ఏ రకంగా గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారో వివరించారు. జగన్‌ గ్యాంగ్ చేసిన కుట్రను అప్పట్లో నిఘా వర్గాలు కూడా పగిట్టలేకపోయాయని చెప్పారు. ఆ కుట్రను అంచనా వేయలేకే రాజకీయంగా 2019 ఎన్నికల్లో నష్టపోయామని అన్నారు. క్రిమినల్స్‌ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని అన్నారు. విశాఖలో జగన్‌పై జరిగిన కోడికత్తి డ్రామాల నెపాన్ని కూడా తమపైనే వేశారని చెప్పారు. ఇటీవల జగన్‌ ఇంటి ముందు గడ్డి తగలబడిందని.. వైసీపీ నేతలు నానా హంగామా చేశారని గుర్తు చేశారు. అక్కడ సీసీ టీవీ ఫుటేజిని అడిగితే తోక ముడిచారని.. జగన్‌ చేసే కుట్రలను తిప్పికొట్టాలని.. జగన్‌తో అప్రమత్తంగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. దీన్ని బట్టి చూస్తే జగన్‌ మనస్తత్వాన్ని, రాజకీయ ఎత్తులను చంద్రబాబు చదివినంత ఎవరూ చదవలేదనే చెప్పాలి.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్