ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రీడాకారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన… రాజధానిపై టీడీపీ స్టాండ్ ఏదో చెప్పగలరా అని ప్రశ్నించారు. మరో మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్ప టిన తర్వాత మొట్టమొదటిగా విశాఖ రాజధానిపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడి యాన్ని కూల్చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్నికల యావ తప్ప ప్రజా సంక్షేమం పట్టదని చెప్పారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఏపీలో పరిస్థితుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి ధర్మాన.
ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట – మంత్రి ధర్మాన
0
326
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


