CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 21లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయగా.. 93.12శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 1.28శాతం తగ్గినట్లు బోర్డు తెలిపింది. 99.91శాతం ఉత్తీర్ణతతో తిరువనంతపురం తొలి స్థానంలో నిలవగా.. 99.18శాతంతో బెంగళూరు రెండు, 99.14శాతం ఉత్తీర్ణతతో చెన్నై మూడో స్థానంలో నిలిచాయని వెల్లడించింది.. 1,95,799 మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంది. ఈ ఫలితాలను చూడడానికి cbseresults.nic.in క్లిక్ చేయండి. కాగా CBSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు జరిగాయి.

Latest Articles

టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?

ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్