26.2 C
Hyderabad
Thursday, February 22, 2024
spot_img

ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్‌కు సినిమాటిక్ సెల్యూట్

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో ఆరు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది.

ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్ డిజైన్ చేయించి..వివిధ రంగుల్లోని ఆరు హెలికాప్టర్స్ తో గాలి నుంచి ఆ పోస్టర్ కు సెల్యూట్ చేయించారు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ వీడియోను షేర్ చేసింది. ఓ భారీ హాలీవుడ్ సినిమా స్టైల్ లో యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్ కోసం అభిమానులు చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 22న సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Latest Articles

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి

   పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించారు. మహ బూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు కాంగ్రెస్ తొలి అభ్యర్థి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్