22.2 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

‘సైరా’ దగ్గరికి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక సినిమా నటుడనే కాదు, ఆత్మీయతకు, నిరాడంబరతకు, సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ గా అందరూ చూస్తుంటారు. అయితే ఆయనలో ఉన్న ఆదర్శవాది కూడా ఉన్నారని చెప్పడానికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి చెందిన బ్లడ్ సెంటర్ ఒకటి నిదర్శనం అని చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి ప్రాణదానం కల్పించిన ఆయన స్ఫూర్తిని తెలుసుకున్న బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్ ఓవెన్‌ చిరు బ్లడ్ బ్యాంక్ ని సందర్శించడం విశేషం. అంతేకాదు అక్కడున్న ఆధునిక సౌకర్యాలు చూసి, చిరంజీవిని ఎంతో మెచ్చుకున్నారు.

అంతేకాదు…ఆ బ్లడ్ సెంటర్ స్ఫూర్తితో తను కూడా రక్తదానం చేయడం విశేషం. అలాగే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్- 2022 అవార్డు వచ్చిన సందర్భంగా చిరంజీవిని అభినందించారు. చిరంజీవి బ్లడ్ సెంటర్ ద్వారా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారిని గారెత్ విన్ ఓవెన్ అభినందించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్