పవర్ పేట సందీప్ కి సక్సెస్ అందించేనా..?

సక్సెస్ రావాలంటే.. కష్డపడితే సరిపోదు.. కాలం కలిసి రావాలి. హీరో సందీప్ కిషన్ సక్సెస్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు కానీ.. ఆశించిన విజయం మాత్రం రావడం లేదు. అందుకనే.. ఈసారి రూటు మార్చాడు. కథ విషయంలో చాలా కసరత్తు చేశాడు. పవర్ పేట అంటూ కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశాడు. ఇంతకీ.. పవర్ పేట గ్లింప్స్ ఎలా ఉంది..? ఈ మూవీతో అయినా సందీప్ సక్సెస్ సాధిస్తాడా.? లేదా..?

సందీప్ కిషన్.. ప్రస్థానం అంటూ కెరీర్ ఆరంభంలోనే తనలోని నటుడ్ని బయటకు తీసే పాత్రలో నటించాడు. స్నేహగీతం, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఇలా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి మెప్పించాడు. అయితే.. తన టాలెంట్ కి తగ్గట్టుగా రావాల్సిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే ఇంకా రాలేదు అనేది నిజంగా నిజం. ఆమధ్య మాస్ ని మెప్పించాలని.. పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినప్పటికీ.. వచ్చిన ఆఫర్స్ సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు సందీప్ కిషన్.

ఈమధ్య కాలంలో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా సక్సెస్ అయ్యింది. అయితే.. ఆతర్వాత చేసిన రాయన్, మజాకా సినిమాలు మాత్రం ఆడియన్స్ ని మెప్పించలేదు. కెరీర్ లో బ్లాక్ బస్టర్ సాధించాలని తపిస్తున్న సందీప్ కిషన్.. ఇప్పుడు పవర్ పేట అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి కృష్ణ చైతన్య డైరెక్టర్. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సింహం గురించి చెప్పిన డైలాగ్ బాగుందనే టాక్ వచ్చింది. ప్రేమ, గౌరవం, రాజకీయం అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఒక సామాన్యుడు రాజకీయ శిఖరాలను ఎలా అధిరోహించాడు అనే కథతో రూపొందుతోందని తెలుస్తోంది.

ఈ మూవీలో సందీప్ కిషన్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని చార్మినార్ ఏరియాలో గల ఒక పురాతన థియేటర్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాని నితిన్ తో చేయాలి అనుకున్నాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పార్టులుగా ఈ సినిమాని నితిన్ తో చేయాలి అనుకుంటే సెట్ కాలేదు. ఆఖరికి సందీప్ తో సెట్ అయ్యింది. అయితే.. మూడు పార్టులుగా కాకుండా ఒకే పార్ట్ గా తీస్తున్నారు. చాన్నాళ్లు నుంచి కథ పై కసరత్తు చేయడం వలనే స్టోరీ బాగా సెట్ అయ్యిందని.. సందీప్ ఆశించిన సక్సెస్ రావడం ఖాయమని టాక్. మరి.. ఈ మూవీతో సందీప్ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్